విశాఖపట్నం తీరంలో బుధవారం హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని బీచ్ రోడ్డు, ఎంవీపీ కాలనీ వంటి ప్రాంతాల్లో యువతీయువకులు రెయిన్ డ్యాన్స్‌లు, డీజే పాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 'బురా న మానో హోలీ హై' అంటూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ స్నేహభావంతో పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ పాల్గొనడంతో విశాఖ వీధులన్నీ రంగులమయమై కొత్త శోభను సంతరించుకున్నాయి.