విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం మాస్ కమ్యూనికేషన్స్, హిందీ, రంగస్థల విభాగాలకు నూతన విభాగాధిపతులు గురువారం నియమించారు. ఆచార్య పి. ప్రేమానందంను జర్నలిజం మాస్ కమ్యూనికేషన్స్ విభాగానికి విభాగాధిపతిగా, ఆచార్య ఎన్. సత్యనారాయణను హిందీ విభాగానికి విభాగాధిపతి గా, డి. సింహాచలంను థియేటర్ ఆర్ట్స్ విభాగాధిపతిగా నియమించారు. నియామక ఉత్తర్వులను ఏయూ వీసీ అందజేశారు.