విశాఖ: ఏయూ శతాబ్ది క్రీడలు విజయవంతం

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ తెలిపారు. మంగళవారం సెనేట్ మందిరంలో ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన 'రన్-అప్ టీమ్' సభ్యులతో సమావేశమై, వారిని అభినందించి జ్ఞాపికలను అందజేశారు. ఈ పోటీలు సిబ్బంది మధ్య ఐక్యతను, ఏయూ వారసత్వాన్ని చాటిచెప్పాయని వీసీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, అధికారులు విజయమోహన్, హరనాథ్, మంజుల, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్