ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోని 53 విశ్వవిద్యాలయాలకు నాయకత్వం వహించే స్థాయిలో ఉందని, ఇది విద్యా రంగానికి ఒక దిక్సూచి వంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్ర విభజన జరిగిన క్లిష్ట సమయంలో తొలి క్యాబినెట్ సమావేశాన్ని ఇక్కడే నిర్వహించామని గుర్తు చేసుకున్నారు. ఏయూ స్థాపన వెనుక ఎందరో రాజుల త్యాగం, కృషి దాగి ఉందని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన నాయకులుగా, విజయవంతమైన వ్యాపారవేత్తలుగా రాణించడం గర్వకారణమని పేర్కొన్నారు.