విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఎదగాలని హెచ్‌ఆర్డీ కార్యదర్శి కోన శశిధర్ ఆకాంక్షించారు. శతాబ్ది వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏయూ సామాజిక, మేధో అభివృద్ధికి కీలక వేదికగా నిలిచిందని కొనియాడారు. ఉన్నత విద్యలో సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, అధ్యాపకులను సత్కరించారు.