విశాఖ: కొండల్లో తప్పిపోయిన AU స్టూడెంట్స్.. రక్షించిన పోలీసులు

మధురవాడ కొమ్మాది శాప్ గ్రౌండ్ వెనుక కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు అడవిలో దారి తప్పిపోయారు. రాత్రి సమయంలో మొబైల్ సిగ్నల్ అందడంతో వారు 112కు సమాచారం అందించారు. పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ గిరిబాబు, హోంగార్డ్ ఈశ్వరరావు వెంటనే గాలింపు చర్యలు చేపట్టి, రాత్రికే విద్యార్థులను గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్