గంభీరం పంచాయతీ వద్ద దుక్కవానిపాలెం వంతెనపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన సత్యాల కిషోర్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. జీవీఎంసీ నీటి సరఫరా శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న కిషోర్ విధులకు ఆటోలో వెళ్తుండగా, ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనను పరిశీలిస్తున్నారు.