విశాఖ: ఏయూలో 'ఆక్స్‌మిక్' ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ), ఆక్స్‌మిక్ ల్యాబ్స్ సంయుక్తంగా 'ఏయూ-ఆక్స్‌మిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐ సిస్టమ్స్'ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఆక్స్‌మిక్ ల్యాబ్స్ సీఈఓ రాజ కోడూరి బుధవారం వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపీయూ వంటి రంగాల్లో విద్యార్థులకు శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు అందించడమే ఈ కేంద్రం లక్ష్యం. ఏయూ వీసీ ఆచార్య జి. పి. ఆర్. రాజశేఖర్ మాట్లాడుతూ, ఎంఓయూ కుదిరిన రెండు రోజుల్లోనే కార్యాచరణ ప్రారంభించడం సంతోషదాయకమని, త్వరలోనే పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్