విశాఖ: భాస్కర్‌కు ఎన్‌సీసీ సెకండ్ ఆఫీసర్‌గా పదోన్నతి

బెతనీ స్కూల్ అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్ నిమ్మకాయల భాస్కర్ థర్డ్ ఆఫీసర్ స్థాయి నుంచి సెకండ్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా, గురువారం విశాఖలోని లాసన్స్ బే కాలనీలోని 13(ఏ) ఆంధ్ర బెటాలియన్ కార్యాలయంలో 'ర్యాంక్ సెరిమనీ' నిర్వహించారు. కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ నిరాజ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ స్వర్ణిమ్ ప్రభాత్ కలిసి భాస్కర్ భుజాలపై షోల్డర్ స్టార్స్‌ను ధరింపజేశారు. ఎన్‌సీసీ కేడెట్లలో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడంలో ఆయన చూపుతున్న అంకితభావానికి ఈ గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమంలో బెతనీ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు కేడెట్లు ఆయనకు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్