విశాఖ‌: కనక మహాలక్ష్మి అమ్మవారి స‌న్నిధిలో కెనడా దేశస్థులు

విశాఖ నగరంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని శనివారం కెనడా దేశస్థులు దర్శించుకున్నారు. ప్రతి శనివారం జరిగే తులసి దళార్చన సేవలో వారు పాల్గొన్నారు. పూజ తర్వాత ఆలయ పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి, శేషవస్త్రం, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, అమ్మవారి చారిత్రక నేపథ్యం గురించి వారు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. భారతీయ సనాతన ధర్మం, ఆలయ సంప్రదాయాలు తమను ముగ్ధులను చేశాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్