విశాఖ: చంద్రబాబు విదేశీ పర్యటన రాష్ట్రానికి మేలు

ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి దోహద పడుతుందని, ప్రజల ఆకాంక్షలు ఆయన చూపిన దారిలో ప్రతిధ్వనిస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గురువారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో అన్నారు. ఈ పర్యటనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమై, రాష్ట్రంలోని మౌలిక రంగాలకు, విద్య, వైద్యం, పరిశ్రమ, నైపుణ్యాభివృద్ధి రంగాలకు పెట్టుబడులను ఆకర్షించేలా చర్చలు జరిపారన్నారు.

సంబంధిత పోస్ట్