రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలతో, తూర్పు కోస్ట్ రైల్వే శుక్రవారం నుంచి వెయిట్‌లిస్ట్ టికెట్ల అడ్వాన్స్‌డ్ చార్టింగ్‌ను అమలు చేయనుంది. ఈ నూతన విధానం వల్ల వెయిట్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు ఉపశమనం లభించనుంది. మధ్యాహ్నం 2 గంటలలోపు బయలుదేరే రైళ్లకు మునుపటి రోజు రాత్రి 9 గంటలకు చార్టు సిద్ధం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు బయలుదేరే రైళ్లకు రైలు బయలుదేరడానికి 8గం. ముందు చార్టు సిద్ధం చేస్తారని విశాఖ రైల్వే డీఆర్‌ఎం లలిత్ బోరా గురువారం తెలిపారు.