విశాఖ: రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పెందుర్తి సీఐ కె. వి. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకుని మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. ప్రవర్తనలో మార్పు లేని వారిపై నగర బహిష్కరణ (సిటీ ఎక్స్‌టర్న్‌మెంట్), పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్