విశాఖ: సాయినాథునికి సీపీ పూజలు

విశాఖలోని మురళీనగర్‌లోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో శుక్రవారం శ్రీ సాయినాథునికి పూజ మహోత్సవంలో సీపీ శంఖబ్రత బాగ్చి సతీమణి సమేతంగా పాల్గొన్నారు. గురు పాదుకా పూజ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ. సనాతన ధర్మం, భగవంతునితో అనుబంధం, పెద్దలను, గురువులను ఎలా గౌరవించాలి అనే విషయాలపై చక్కగా ఉపన్యసించారు. ఈ సందర్భంగా సీపీ దంపతులు వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్