నగర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రభుత్వ అధికారులమని నమ్మించి రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ. 1.05 కోట్లు కాజేసిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపిన వివరాల ప్రకారం, 67 ఏళ్ల బాధితుడిని ఆధార్ కేసుల పేరుతో భయపెట్టి, విడతల వారీగా భారీ మొత్తాన్ని వసూలు చేశారు. ఈ కేసులో సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు సరఫరా చేస్తూ కమీషన్లు పొందుతున్న విశాఖకు చెందిన జి. ధనుంజయరావు, జి. దినేష్, జి. సూర్యకుమారి, ఆర్. కృష్ణ, ఎ. హేమసుందరరెడ్డి, ఐ. కోటేశ్వరరావులను పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి గురువారం రిమాండ్‌కు తరలించారు.