సింహాచలంలో రెండు రోజుల పాటు జరిగిన గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. 32 కిలోమీటర్లు నడిచి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ప్రదక్షిణ సమయంలో భక్తులు తినుబండారాలు, చెత్తను రోడ్డుపై పడవేయడంతో, అవి బలంగా రోడ్డుకు అంటుకున్నాయి. వాటిని తొలగించేందుకు జీవీఎంసీ కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు, రోడ్డు అంతా వ్యర్థాలతో నిండిపోయిన పరిస్థితి నెలకొందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.