విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, ఆదివారం నాడు దివీస్ లాబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ ప్రసాద్‌కు 'ఉదాత్త దాత' పురస్కారాన్ని ఏయూ వీసీ రాజశేఖర్ అందజేశారు. ఆయన తరఫున జనరల్ మేనేజర్ వై. ఎస్. కోటేశ్వరరావు ఈ అవార్డును స్వీకరించారు. విశ్వవిద్యాలయంలో అనలిటికల్ ల్యాబ్‌లు, త్రాగునీటి సదుపాయాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ సత్కారం అందించారు.