పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా సమిష్టిగా కృషి చేయాలని విశాఖ ఏయూ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఏయూ నార్త్ క్యాంపస్ లోని అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహాల ప్రాంగణంలో విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఏయూ హార్టీ కల్చరల్ గార్డెనింగ్ విభాగం ప్రత్యేకంగా వివిధ పండ్ల జాతుల మొక్కలను, దీర్ఘకాలం జీవించే మొక్కలను నాటించారు.