విశాఖ తూర్పు నియోజకవర్గం లోని విశాలాక్షి నగర్ సబ్ స్టేషన్ పరిధిలో వివిధ పనులు నిర్వహిస్తున్నందున శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జోన్ 3 సింహాచలం బుధవారం తెలిపారు. ఆరోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విశాలాక్షి నగర్, రెవెన్యూ కాలనీ, చలపతి నగర్, షిర్డీ సాయి వెటర్నరీ కాలనీ, సంజీవ్ నగర్, ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని అన్నారు.