విత్తన బంతుల తయారీ ద్వారా పచ్చదనాన్ని భారీగా పెంపొందించాలని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు. శనివారం విశాఖపట్నంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విత్తన బంతులను తయారు చేయాలని, ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమమని తెలిపారు. విశాఖ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐ. కాశీ విశ్వనాథ్ రాజు దేశీయ విత్తన సంపదను కాపాడుకోవాలని కోరారు.