విశాఖ: ఇద్దరితో వివాహేతర సంబంధం.. మర్డర్

పీఎంపాలెం పోలీసుల దర్యాప్తులో ఒక వ్యక్తిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పుఘర్‌లో నివాసముంటున్న శంకర్రావుకు మధురవాడకు చెందిన రాజరాజేశ్వరితో వివాహేతర సంబంధం ఉండేది. ఇటీవల రాజరాజేశ్వరి తేజ అనే మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో శంకర్రావుతో గొడవలు జరిగేవి. ఈ నెల 1న, వీరి సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించిన రాజరాజేశ్వరి, తన సోదరుడు వాసు, ప్రియుడు తేజతో కలిసి శంకర్రావును హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

సంబంధిత పోస్ట్