ఇటీవల ప్రమాదంలో మరణించిన నృత్య కళాకారిణి రమ కుటుంబానికి విశాఖ డ్యాన్సర్స్, డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ మహిళా కళాకారులు అండగా నిలిచారు. శుక్రవారం ఆమె భర్త అప్పలరాజుకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయం బాండ్‌ను వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్ చేతుల మీదుగా అందజేశారు. అదే విధంగా, మహిళా నృత్య కళాకారులకు ప్రదర్శనల సమయంలో ఉపయోగపడేలా గ్రీన్ రూమ్స్ వంటి సామాగ్రిని కూడా అందజేశారు.