విశాఖ‌: రేపు కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవం

విశాఖపట్నంలో మంగళవారం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం జరగనుంది. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు కోర్సులు పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు అందజేస్తారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్