విశాఖ: కార్పొరేటర్ కి ఫుడ్‌ కోర్టు వ్యాపారుల హెచ్చరిక

విశాఖపట్నంలోని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తికి, ఫుడ్ కోర్టు వ్యాపారస్తులు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. గురువారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లి చెప్పులతో కొడతామని వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఫుడ్ కోర్టు వ్యాపారస్తులకు మంజూరు చేసిన 6 కోట్ల రూపాయల నిధులను ఇవ్వడానికి వీలు కాదని కార్పొరేటర్ పీతల మూర్తి గురువారం జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వ్యాపారస్తులు వెంటనే స్పందించి, కార్పొరేటర్‌ను ఇంటికి వెళ్లి కొడతామని చెప్పులు చూపించి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్