విశాఖ: రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

విశాఖ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఆయన జీవీఎంసీ 4వ జోన్ 28వ వార్డు పరిధిలోని రామ్ నగర్ లో పలుచోట్ల తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్