శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి చెందిన బాలికపై మార్చి 25న వెంకటరమణ అత్యాచారం చేసి హత్య చేసినట్లు డీఎస్పీ వివేకానంద బుధవారం వెల్లడించారు. ఎస్.కోటకు చెందిన వెంకటరమణ వైజాగ్‌లోని పెందుర్తి పరిధి సుజాతనగర్‌లో ఉంటున్నాడు. బాలికను తన అపార్టుమెంట్‌లో అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి అనారోగ్యంతో చనిపోయిందని తల్లిదండ్రులకు అప్పగించాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.