విశాఖలోని కైలాసగిరిలో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ కోసం పర్యాటకుల ఎదురుచూపులకు తెరపడింది. డిసెంబర్ 1 నుండి ఈ బ్రిడ్జ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు VMRDA ప్రకటించింది. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో VMRDA–ప్రైవేట్ సంస్థ కలిసి దీనిని నిర్మించారు. ఒకేసారి 100 మంది బరువును మోయగలదు. అయితే ముందు జాగ్రత్తగా ఒక్కసారికి 40 మందినే అనుమతించనున్నారు.