విశాఖ: శాకాంబరి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

గురువారం ఆషాడ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అల్లిపురంలో కొలువైయున్న శ్రీ నీలమ్మ వేప చెట్టు అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆలయ అధికారులు ముందుగానే చేపట్టారు. ఆషాడ పౌర్ణమి సందర్భంగా రేపు విశేష పూజలు ఉదయం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి జి. వి. రమాభాయి తెలిపారు.

సంబంధిత పోస్ట్