విశాఖ‌: గంగ‌మ్మ‌త‌ల్లికి హోంమంత్రి అనిత పూజ‌లు

ఆదివారం నగరంలోని కొత్త జాలారిపేటలో వెలసిన శ్రీ గంగా సమేత వైశాఖేశ్వర ఆలయాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆమె, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి విచ్చేసిన హోం మంత్రికి కొత్త జాలారిపేట గ్రామస్థులు, మత్స్యకార ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి అనిత స్థానిక భక్తులతో ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెను శాలువాతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్