విశాఖ: 'జగన్‌ను అడ్డుకుంటే ప్రజలే తిరగబడతారు'

మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు అండగా పర్యటించగా, పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె. కె. రాజు ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ పర్యటనలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్