విశాఖపట్నంలో గాలి నాణ్యత ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన రెస్పైర్ లివింగ్ సైన్సెస్ నిర్వహించిన అధ్యయనంలో, జనవరి-ఏప్రిల్ మధ్య పది రోజుల్లో ఏడు రోజులు గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో నమోదైందని వెల్లడైంది. పీఎం10 స్థాయులు జాతీయ ప్రమాణాల కంటే అధికంగా ఉన్నాయని తెలిపింది. పరిశ్రమలు, పోర్టు కార్యకలాపాలు, ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్, వాహనాల కాలుష్యమే దీనికి ప్రధాన కారణాలని అధ్యయనం పేర్కొంది. వరుసగా మూడో ఏడాది కూడా విశాఖ రాష్ట్రంలో అత్యంత కాలుష్య కేంద్రంగా నమోదైంది.