విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై హోంమంత్రి అనిత తాజాగా స్పందించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని శుక్రవారం హెచ్చరించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత విద్యార్థినులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. పాఠశాలలలో విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.