విశాఖ: రోడ్డుపై కుప్పకూలిన మొక్కల ఇనుప స్టాండ్

విశాఖ బీచ్ రోడ్డులో సాగర్ నగర్ వద్ద వంతెనపై అలంకరణగా మొక్కలతో ఇనుప స్టాండ్ ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణలో నిర్లక్ష్యం చూపారు. ఊహించినట్లే అది గాలికి గురువారం ఒక్కసారిగా ఊడి రోడ్డుపై పడిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఏర్పాటు చేసిన మొక్కల్లో చాలావరకు చనిపోయాయి. అయినా నిర్వాహకులు పట్టించుకోకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్