విశాఖ‌: ఇంధన సంక్షోభంపై వరుదు కల్యాణి ధ్వజం

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సంక్షోభం తలెత్తడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి విమర్శించారు. పొరుగు రాష్ట్రాల్లో సరఫరా సవ్యంగా ఉన్నా, ఇక్కడ 70 శాతం పెట్రోల్ బంకులు మూతపడటం పరిపాలనా వైఫల్యమేనని ఆమె ఆరోపించారు. ఎరువుల కోసం రైతులు, గ్యాస్ కోసం లబ్ధిదారులు, ఇప్పుడు వాహనదారులు పెట్రోల్ కోసం క్యూలైన్లలో నిలబడే దుస్థితి కల్పించారని చంద్రబాబు సర్కారును ఆమె నిలదీశారు. రాష్ట్రంలోనే ఈ కొరత ఎందుకుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్