విశాఖ‌: మూగజీవాల దాహం తీర్చుదాం

వేసవి ఎండల దృష్ట్యా పశుపక్ష్యాదుల దాహం తీర్చడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె. వి. రత్నం పిలుపునిచ్చారు. బుధవారం విశాఖ ఎంవీపీ కాలనీలోని ఆళ్వార్ దాస్ డిగ్రీ కళాశాల మైదానంలో పక్షుల కోసం మట్టి పాత్రల్లో నీటిని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 20 వేల మట్టి పాత్రల ద్వారా నీటి వసతి కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. అడవుల్లో వన్యప్రాణులకు నీరు, ఆహారం అందుబాటులో ఉంచి, అవి వేటగాళ్ల బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్, మ్యాంగో మేన్ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్