విశాఖ: ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వ్యక్తి మృతి

విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెస్ట్ బస్టాండ్‌లో సుమారు 30 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. నలుపు-తెలుపు బనీను, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి గురించి తెలిసిన వారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్