మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం విశాఖ ఆర్కే బీచ్‌కు వచ్చిన మహిళలు సముద్ర స్నానాలు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. పెద్ద కెరటాల్లో చిక్కుకొని కొందరు మహిళలు కింద పడిపోయారు. ఒక మహిళ కాలు విరిగింది. మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి, మహిళలను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అనంతరం 108కు ఫోన్ చేసి, బాధితులను ఆసుపత్రికి తరలించారు.