విశాఖ;అద్భుత అనుభూతిని కలిగించిన" మాయా వరల్డ్"

విశాఖ సాగరతీరం టియు 142 ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన 'మాయా వరల్డ్' ను విఎంఆర్డిఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా విశాఖలో ఏర్పాటు చేసిన ఈ మాయా వరల్డ్, నగర వాసులతో పాటు పర్యాటకులను ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'ఇమాజిన్ రూమ్స్' తరహాలో రూపొందించిన ఈ మ్యూజియం, లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్