విశాఖ: రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి స్పాట్ డెడ్

విశాఖపట్నంలో 104 ఏరియాలోని కేంద్రీయ విద్యాలయం ఎదుట బీఆర్టీఎస్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి అమిత్‌కుమార్ (27) మృతి చెందాడు. రాజస్థాన్‌కు చెందిన అతను నవశక్తి విహార్‌లో నివసిస్తూ నేవీలో సేవలందిస్తున్నాడు. బుధవారం రాత్రి స్నేహితుల్ని కలిసిన తర్వాత ఇంటికి వస్తుండగా ద్విచక్రవాహనం అదుపు తప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతనికి భార్య మనీషాదేవి, కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్