విద్యా ప్రమాణాలతో లక్షలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గీతం యూనివర్సిటీపై వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభిరాం హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గీతం యాజమాన్యం ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా, ప్రభుత్వ ధర చెల్లించి క్రమబద్ధీకరించాలని కోరుతుంటే, దానిపై విషప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. గతంలో శారదా పీఠం వంటి సంస్థలకు అడ్డగోలుగా భూములిచ్చిన వైసీపీకి గీతం గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. జీవీఎంసీ కౌన్సిల్‌లో వైసీపీ సభ్యుల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.