ప్రపంచ టెక్ మ్యాప్‌లో విశాఖపట్నం కీలక మైలురాయిని చేరుకుంది. విశాఖ జిల్లాలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 1 గిగా వాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ నెల 28న తర్లువాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. గూగుల్ రాకతో విశాఖకు అంతర్జాతీయంగా విశ్వఖ్యాతి లభించడమే కాకుండా, మరిన్ని దిగ్గజ టెక్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.