విశాఖ నగరంలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడకు చెందిన తిరుపతిరావు, సన్యాసిరావు, లచ్చిరెడ్డి, పూలు నాయుడులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మొదట లాభాలు చూపించి ఆ తర్వాత మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.