విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, న్యాయ కళాశాల నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల పోస్టర్‌ను ఏయూ వీసీ ఆచార్య జి. పి. రాజశేఖర్ సోమవారం ఆవిష్కరించారు. ఏప్రిల్ 23న బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా న్యాయ విద్య ప్రస్థానంపై గెస్ట్ లెక్చర్స్, లీగల్ ఎగ్జిబిషన్, విశ్రాంత ఉద్యోగులకు సన్మానం, ప్రతిభా పురస్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. సీతామాణిక్యం, పలువురు మాజీ వీసీలు పాల్గొన్నారు.