విశాఖ: ఏయూలో 'ప్రీ-ఇంక్యుబేషన్ సెంటర్' ప్రారంభం

విశాఖపట్నంలోని ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, బీచ్ రోడ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ గురువారం 'ప్రీ-ఇంక్యుబేషన్ సెంటర్ – ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్’ను ప్రారంభించారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలను స్టార్టప్‌లుగా మార్చి, వారిని ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ఈ కేంద్రం లక్ష్యమని తెలిపారు. స్టార్టప్‌లకు రూ. 5 లక్షల వరకు 'శతాబ్ది ఇన్నోవేషన్ & ఇంపాక్ట్ గ్రాంట్‌'ను కూడా ప్రకటించారు. ప్రోటో-రన్, ఫౌండర్స్ కనెక్ట్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మార్గదర్శకత్వం అందిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్