ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విశాఖపట్నం మాస్టర్ ప్లాన్-2041పై ప్రజల సలహాలు, సూచనలను జులై 16,17 తేదీలలో స్వీకరించనున్నట్లు వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ శనివారం తెలిపారు. మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాధన్‌తో కలిసి, బుధ, గురువారాల్లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు వీఎంఆర్డీఏ 3వ అంతస్తు సమావేశ మందిరంలో ఈ వినతులను స్వీకరిస్తారని ఆయన వెల్లడించారు.