విశాఖ: ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో మొదలైన వాన

గడచిన నాలుగు రోజుల నుంచి సూర్య తాపానికి విలవిలలాడుతున్న నగర ప్రజలకు ఆదివారం కాస్త ఊరట లభించింది. నగరంలో మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణ మార్పులు చోటుచేసుకుని, కారు మబ్బులు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో భారీ వర్షం మొదలైంది. అనుకోకుండా వచ్చిన ఈ వర్షానికి పాదచారులు, వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. రోడ్డు ప్రక్కన వ్యాపారం చేసే చిరు వర్తకులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్