విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలతో నిర్వహించిన సమీక్షలో, నోడల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణకు ఆదేశించారు. ఇప్పటివరకు 134 కేసులు నమోదు చేసి, 106 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.