విశాఖ;ఐక్యతకు గుర్తుగా" రన్ ఫర్ యూనిటీ "

అక్టోబర్ 31న ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజును రాష్ట్రీయ ఏక్తాదివాస్ గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న నేపథ్యంలో, నగరంలో ఐక్యతకు గుర్తుగా ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం సిరిపురంలోని వుడా చిల్డ్రన్ ఎరీనా కూడలి నుండి సర్క్యూట్ హౌస్ వద్ద గల పటేల్ జంక్షన్ వరకూ జరిగిన ఈ 'రన్ ఫర్ యూనిటీ' ర్యాలీలో నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని అందరిలో ఐక్యత స్ఫూర్తిని నింపారు. ర్యాలీకి ముందు, పటేల్ జంక్షన్ వద్ద గల సర్దార్ పటేల్ విగ్రహానికి సీపీ పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్