విశాఖ: 2 నుంచి హనుమంతవాక సాయిబాబా బ్రహ్మోత్సవాలు

విశాఖలోని హనుమంతవాక విమ్స్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న విశాఖ షిర్డీ సాయి సంస్థాన్ ఆలయంలో జూన్ 2 నుంచి 4 వరకు సాయిబాబా వారి 9వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆలయ చైర్మన్ బి. వి. రమణ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 2న ఉదయం 6:30 గంటలకు 108 కలశాల క్షీరాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, సాయంత్రం ప్రవచనాలు ఉంటాయి. 3న సత్సంగం, భజనలు నిర్వహిస్తారు. చివరి రోజైన జూన్ 4న గణపతి అభిషేకం, ద్వారకామయిలో సాయిబాబా వ్రతం, మధ్యాహ్నం మహా అన్నప్రసాద సంతర్పణ ఉంటాయి. వ్రతంలో పాల్గొనే దంపతులు జూన్ 3 లోగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్