జీవీఎంసీ 25వ వార్డు శాంతిపురంలో జూనియర్ కళాశాల సమీపంలో నెల రోజులుగా మురుగునీరు లీకై రోడ్డుపై నిలిచిపోతోంది. యూజీడీ మ్యాన్ హోళ్ల నుంచి లీకైన మురుగునీరు రోడ్డంతా వెదజల్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి లీకేజీని నియంత్రించే చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.